మేడిగడ్డకు వరద పోటు
భూపాలపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వైపు వరద నీరు భారీగా చేరుతోంది. వరద ప్రవాహాన్ని దిగువకు పంపించే చర్యల్లో భాగంగా అధికారులు మేడిగడ్డ బ్యారేజీకి చెందిన 85 గేట్లను(Medigadda Barrage 85 Gates) ఎత్తి ఉంచారు. ప్రస్తుతం బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,01,530 క్యూసెక్కులుగా ఉన్నట్లు సమాచారం.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే ప్రాణహిత, గోదావరి(Godavari Flood Telangana) నదుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో NDSA సూచనలు, భద్రతా చర్యలు ఇప్పటికే కీలకంగా మారాయి. వరద నీటిని నిల్వ చేయకుండా గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తుండటంతో మేడిగడ్డ పరిసరాల్లో నీటి ప్రవాహంపై అధికారుల నిఘా కొనసాగుతోంది. గతంలో మేడిగడ్డలో చోటుచేసుకున్న నిర్మాణ సంబంధిత సమస్యల నేపథ్యంలో ప్రస్తుత వరద పరిస్థితి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.