క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం 44శాతానికి పెంచాలి

27-09-2026 | 10:55am

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్(Oil Palm)రైతు సంఘ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో  అఖిల పక్ష రైతు సంఘ సమావేశం అప్పారావు పేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో జరిగింది. ఈ సందర్భంగా ఆలపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుండి 11 శాతం వరకు తగ్గించిందని, ఇది ఆయిల్ పామ్ రైతులకు శరాఘాతం లాంటిదని అన్నారు. అసలే ఎరువుల రేట్లు, కూలీల రేట్లు, వ్యవసాయ,డ్రిప్ పరికరాల రేట్లు పెరిగి సతమతమవుతుంటే, ఇప్పుడు దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతు ఆందోళనలో ఉన్నారని అన్నారు.

ఒక వైపు ఆయిల్ పామ్ పంటను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే రైతులకు నష్టం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం సహేతుకం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడానికి వీల్లేదని, 44 శాతం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రిఫైన్డ్ పామాయిల్ ఫై సుంకం తగ్గించకుండా వ్యాపారులకు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది సీజేకూర్చింది అన్నారు  తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో కమిటీల వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్‌లు పెట్టి, ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని తెలిపారు.

ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్లు ఇప్పటి వరకు ప్రవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని, అలా కాకుండా ఆయిల్ ఫెడ్ ద్వారానే కలెక్షన్ సెంటర్లు నిర్వహించే విధముగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు.ట్రాన్స్పోర్ట్ కొరకు టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కె వి సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు, మాజీ జీపీటీసీ పైడి వెంకటేశ్వరావు, పి మురళి, మన్నెం అప్పారావు, పిట్టల అర్జున్, దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, అంకత మహేశ్వరావు, రావు గంగాధరరావు, యర్రా వసంతరావు, దొడ్డా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు