The Paradiseపై KTR రివ్యూ! వీడియో వైరల్
27-09-2026 | 10:54am
KCRను గుర్తు చేస్తున్న శంకరన్న
The Paradiseలో అసలేం జరుగుతోంది?
సినిమా సూపర్ హిట్ అంటూ ప్రశంసలు!
ప్రియదర్శి శంకరన్నగా KCR వైబ్స్
నాని నటించిన ‘The Paradise’ సినిమా విడుదలైన తర్వాత కథ, యాక్షన్ సన్నివేశాలతో పాటు మరో పాత్ర ప్రత్యేకంగా చర్చలోకి వచ్చింది. అదే ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర(Shankaranna character The Paradise). శంకరన్న పాత్రలో ప్రియదర్శి(The Paradise Priyadarshi) కనిపించిన తీరు, తెలంగాణ యాసలో డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ కొందరు ప్రేక్షకులకు తెలంగాణ మాజీ సీఎం(Former Chief Minister of Telangana), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తు చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు, చర్చలు జరుగుతున్నాయి. పాత్రను చూసిన తర్వాతే ఈ పోలికపై చర్చ మరింత వేడెక్కింది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘The Paradise’ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(The Paradise KTR) ఆసక్తికరంగా స్పందించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ‘The Paradise’పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, అనిల్ జాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు సినిమాను వీక్షించారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ‘The Paradise’పై మరోసారి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా నాని నటన, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. నాని కెరీర్‌లో భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్(KTR Review on The Paradise) సినిమా చూసి స్పందించడంతో మూవీపై మరింత ఆసక్తి పెరుగుతోంది. కేటీఆర్‌తో కలిసి పలువురు ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు సినిమా చూడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.