పాఠశాలలో బతుకమ్మ సంబరం

09-10-2026 | 08:11pm

భైంసా (విజయక్రాంతి) : పట్టణ కేంద్రంలోని wisdom పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు(Teachers) సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు(Students).. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.

మరిన్ని వార్తలు