విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

09-10-2026 | 07:51pm

మేయర్ కొలగాని శ్రీనివాస్

ముకరంపుర, అక్టోబర్ 9(విజయక్రాంతి): నగరపాలక సంస్థ లో విలీనం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధి పై తమ పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టిందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(City Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Municipal Corporation) అభివృద్ధి లో భాగంగా శుక్రవారం 28 వ డివిజన్ లో మేయర్ పర్యటించారు. విద్యారణ్యపురి కాలనీలో స్థానిక కార్పోరేటర్ నున్సావత్ భాస్కర్, కార్పోరేటర్ సాధినేణి లావన్య మునింధర్ తో కలిసి 50 లక్షల యూఐడీఎఫ్ నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు(Drainage and CC road works) భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.

విద్యారణ్యపురి కాలనీలో(Vidyaranyapuri Colony)  స్థానిక డ్రైనేజీ సమస్యను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని, ప్రజలు, కార్పోరేటర్లు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీస్కోని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. 28, 3 రెండు డివిజన్ల పరిదిలోని విద్యారణ్యపురి ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి  అభివృద్ధి కోసం గత కౌన్సిల్ సమావేశంలో సాధారణ నిధుల నుండి దాదాపు 1 కోటి రూ. కేటాయించామని తెలిపారు.

అంతే కాకుండా ఇటీవలే 25 లక్షల నిధులు కేటాయించి సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులను పూర్తి చేసి స్థానిక ప్రజలకు సౌకర్యం కల్పించామని తెలిపారు. డంపు యార్డు ప్రక్షాలన(Cleanup of the dump yard) కోసం మరో 80 కోట్ల ప్రతిపాదనలు పెట్టి టెండర్ ప్రక్రియ(Tender process) చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల  పండగ బతుకమ్మ కు  కావల్సిన ఏర్పాట్లు చేసేందుకు రూ. 2.80 కోట్లు నిధులు కేటాయించి టెండర్లు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అంతే కాకుండా దసర ఉత్సవాలకు కావల్సిన ఏర్పాట్లు కూడ ఘనంగా చేస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ శ్రీనివాస్, ఏఈ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు