కరెంటు కష్టాలను తొలగించాలని రైతుల డిమాండ్
- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా
- నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
బిచ్కుంద, అక్టోబర్ 09 (విజయ క్రాంతి) : కరెంటు కష్టాలను(Electricity problems) తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు(Farmers worried) దిగారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) కలిసి భారీ ధర్నా నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని, రైతాంగానికి నిరంతర విద్యుత్ సరఫరా(Uninterrupted power supply) అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని రైతుల పోరాటానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పొలాలు ఎండిపోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు ఈ సందర్భంగా కోరారు. విద్యుత్ సమస్యను పరిష్కరించి రైతుల ను ఆదుకోవాలని కోరారు.