బిక్కనూర్‌ బాలికల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 08:00pm

బిక్కనూర్, అక్టోబర్‌ 9 (విజయ క్రాంతి): బిక్కనూర్‌ పీఎం శ్రీ బాలికల పాఠశాలలో(Bikaner PM Sri Girls' School) బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు(Female students) సంప్రదాయ దుస్తుల్లో(traditional attire) రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలకు నృత్యాలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరామ్‌ వెంకటేష్‌(Sriram Venkatesh) ఉత్తమ బతుకమ్మలను రూపొందించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజా గంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు