వెంకటరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సంతాపం
దామరచర్ల : అక్టోబర్ :9 : నల్లగొండ జిల్లా(Nalgonda District) డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి(Durgampudi Narayana Reddy) సోదరులు దుర్గంపూడి వెంకటరెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అడవిదేవులపల్లి మండలం ఉల్సాపాలెంలోని వారి స్వగృహానికి శుక్రవారం వెళ్లి, పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామావత్ బాలు నాయక్, సర్పంచ్ రాత్త్ల మోతిలాల్, సామాజికవేత్త, చక్ర టీవీ ఎండీ కొండ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
దుర్గంపూడి వెంకటరెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి స్వగృహానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే బాస్కర్ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర లో పాడే మోశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు యూసుఫ్ ,హతిరామ్ ,సంపత్ ,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.