విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
నిర్మల్ అక్టోబర్ 9 ( విజయక్రాంతి) : విద్యుత్ ప్రమాద నివారణపై(Prevention of Electrical Accidents) ప్రజలకు విద్యుత్ శాఖ(Electricity Department) ఆధ్వర్యంలో అవగాహన సదస్సు(Awareness Seminar) నిర్వహించారు. బంగల్‌పేట్ మహాలక్ష్మి వాడ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో శుక్రవారం విద్యుత్ భద్రతపై డీఈ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. విద్యుత్ వినియోగంలో(Electricity consumption) తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
విద్యుత్ స్తంభాలు, లైన్లకు దూరంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా మరమ్మతులు చేపట్టకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.