పాఠశాలల్లో వెల్లివిరిసిన బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 07:54pm

నాగల్‌గిద్ద, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను(Bathukamma Festival) నాగల్‌గిద్ద మండలంలోని(Nagalgidda Mandal) పలు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు నాగల్‌గిద్ద, కారముంగి, కరస్‌గుత్తి కాంప్లెక్స్‌ల పరిధిలోని పాఠశాలలు, శ్రీగాయత్రి పాఠశాల, కారముంగి అనుభవ మంటప గురుకుల పాఠశాల, మోర్గి మోడల్ స్కూల్, గిరిజన గురుకుల పాఠశాలలో(Tribal Residential School) బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మారుతి జాదవ్, హిరామన్, హనుమంతరావు పాటిల్, లక్ష్మారెడ్డి, అనుభవ మంటప గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అంబిక ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. పాఠశాల ప్రాంగణాలు బతుకమ్మ పాటలతో మార్మోగాయి.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయన్నారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు