మహిళల నరకయాతన?

28-09-2026 | 05:20am
  1. చేగుంటలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు
  2. పనుల నిమిత్తం వస్తున్న వారి అవస్థలు
  3. స్పందించాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి

చేగుంట, సెప్టెంబర్ 27: మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లో బాత్రూమ్ ( సులబ్ కాంప్లెక్స్ )(Sulabh Complex)లేక అవస్థలు పడుతున్న మహిళలు, పురుషులు. చేగుంట మండల జనాభా 53118 ఉండగా పట్టణ జనాభా 10747 ఉంది, ఇందులో మహిళలు 4875 ఉన్నారు. కానీ పట్టణ కేంద్రం లో ఒకటి కూడా సౌచాలయం(వాష్ రూమ్ ) లేకపోవడం గమనార్ధం, పట్టణ కేంద్రానికి మండలంలోని ప్రజలు పని నిమిత్తం వేల సంఖ్యలో చేగుంట కు వస్తు పోతుంటారు, వాష్ రూమ్ కి వెళ్లాలంటే  బస్టాండ్ తప్ప  ఎక్కడ జాడలేదు, పట్టణ కేంద్రంలో శుక్రవారం అంగడి రోజు అయితే మహిళలు యువతులు పడుతున్న కష్టం చెప్పలేని వర్ణనాతీర్థం , గ్రామ పంచాయతీకి లక్షల్లో ఆదాయం ఉన్న వాష్ రూమ్స్ లేకపోవడం బాధాకరం.

చేగుంటలో మహిళల కష్టాలు వర్ణనాతీతం

మెదక్ జిల్లా లో ప్రధాన పట్టణ కేంద్రం లో ఒకటైన చేగుంట పట్టణానికి, మండలం నలుమూలల నుండి నిత్యం వేలాది మంది ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. కానీ వారికి ఒకటి కూడా పబ్లిక్ టాయిలెట్లు లేవు. ముఖ్యంగా బయట గ్రామల నుంచి వచ్చే ప్రయాణికుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పట్టణంలో చిన్న వ్యాపారం చేసుకునే మహిళలు, స్కూలుకు వెళ్లే పిల్లలు, మహిళా పోలీసులు, జర్నలిస్టులు ప్రతిరోజూ నరకం చూస్తున్నారంటే వారి పరిస్థితి గురించి అర్థం చేసుకోవచ్చు. మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన గదులు లేక గంటల తరబడి ఆపుకోవాల్సి వస్తోంది. దీని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది.

మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం

పీరియడ్స్ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు అయితే వర్ణనాతీతం. రద్దీగా ఉండే బస్టాండ్, గాంధీ చౌరస్తా, మెదక్ రోడ్డు, మక్కారాజ్ పేట్ సమీపంలో అత్యవసరంగా టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తేనే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుంది.


మరిన్ని వార్తలు