కొత్తగా 41 బార్లు
దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల
- క్యూర్ పరిధిలో 14, మిగతా చోట్ల 27
- నేటి నుంచి అక్టోబర్ 12 వరకు అప్లికేషన్ల స్వీకరణ
- ప్రతి దరఖాస్తుకు రూ. లక్ష రుసుము
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్(Government releases notification) చేసింది. వీటిలో క్యూర్ పరిధిలోని 14, మిగిలిన ము న్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో 27 ఉ న్నాయి. రూ. లక్ష రుసుముతో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆదివా రం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. క్యూర్, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు తగ్గట్టు బార్ల ఏర్పా టుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజ్గిరి ఏరియాల్లో 14 బార్లకు సంబంధించిన దరఖాస్తులను అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
మిగిలిన జిల్లా ల్లోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూ టీ కమిషనర్ కార్యాలయాలతో పాటు కమిషనర్ కార్యాలయంలోనూ, డీపీఈవో ఆఫీసు ల్లోనూ సమర్పించాల్సి ఉంటుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలి పారు. దరఖాస్తులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ప్రభు త్వ పని దినాల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం tgbcl.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.