ఎమ్మెల్యే గారూ .. స్పందించరూ!
- ఏండ్లుగా మా పాఠశాల భవనం పూర్తి కావట్లే..
- మన ఊరుౠ బడి భవనాల నిధులు ఎక్కడ?
- ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని దుస్థితి
- అసంపూర్తిగా నూతన పాఠశాల భవనాలు
కోయిల్కొండ, సెప్టెంబర్ 27 : కొత్త పాఠశాల భవనం(School building) ప్రారంభమవుతుంది... ఇక పనులు చక చక జరుగుతున్నాయి త్వరలోనే ఆ భవనంలో మా చదువులు సాగుతాయి అనుకున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. 2023 సంవత్సరంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా 17 గ్రామ పంచాయతీల పరిధిలో నూతన పాఠశాల భవనాలు మంజూరు కావడంతో పాటు ప్రారంభమయ్యాయి. కాగా కొన్ని పాఠశాలలకు కొంత మేరకు నిధులు మంజూరు అయినప్పటికీ అధిక పాఠశాలలో నిధులు మంజూరు కాకపోవడంతో నేటికీ ఆ భవనాలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
దీంతో కొత్త భవనంలో ఉష విశాలవంతమైన గదిలో చదువుకోవాలనుకున్న విద్యార్థులకు వారి చదువులు ఆ పాఠశాలలో పూర్తి అవుతున్న భవనాలు మాత్రం పూర్తి కావడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అసంపూర్తిగా ఉన్న బోనాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
నిర్మాణాలు పూర్తయ్యేనా..?
పాఠశాల బోనాలు ఎప్పుడు పూర్తయితాయో తెలియని దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు ఉన్నట్లు వారి తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తుండ్రు. మండలంలోని మల్లాపూర్. వింజమూర్. చంద్రస్పల్లి. రామనపల్లి తండా. గార్లపాడు. రాంపూర్. మల్కాపూర్. అవంగపట్నం. స్కూల్ బిల్డింగ్ లకు సంబంధించి నేటి వరకు బిల్లు రాక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని గ్రామస్తులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి పాఠశాల భవనాలను పూర్తి చేయాలని కోరుతుండ్రు.
ఎమ్మెల్యే స్పందించాలని వేడుకోలు..
స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న భవనాలకు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏండ్ల తరబడి కొత్త భవనాల నిర్మాణం ఆగిపోతే విద్యార్థుల చదువు ఎలా ముందుకు సాగుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి గత నాలుగు సంవత్సరాలుగా ముందుకు కదలని భవనాల నిర్మాణం వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వానికి నివేదికలు..
అసంపూర్తిగా ఉన్న భవనాలకు సంబంధించి నిధులు మంజూరు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. కొన్ని బోనాలకు నిధులు ఇటీవల రావడం జరిగింది. మరిన్ని బోనాలకు త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉంది వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ఆజాజుద్దీన్, ఎంఈఓ, కోయిల్కొండ