టీపీఎస్‌లతో నాణ్యమైన విద్య

28-09-2026 | 05:30am
  1. ఎస్టీయూటీఎస్ గళం వందేళ్లు వినిపించాలి
  2. ఎస్టీయూటీఎస్ వైభవోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్/నాగోల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల్లు (టీపీఎస్) (Telangana Public Schools)ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని  మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) తెలిపారు. ఆరుట్ల స్కూ ల్ ముందు నో అడ్మిషన్ బోర్డులు పెట్టడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.  ఆదివా రం హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఎస్టీయూ (స్టేట్ టీచర్స్ యూనియ న్)టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌ డ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఆధ్వర్యంలో ఎస్టీయూటీఎస్ 80 వసంతాల వైభ వోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబుతో పా టు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ  విద్యార్థులు ప్ర పంచంతో పోటీ పడేలా  విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపా రు. ఆర్థిక సమస్యలున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు.

బదిలీలు, పదోన్నతులను చేపట్టామని,  10 వేల టీచర్ పో స్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. రూ.25 వేల కోట్లు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను రూ.11 వేలకు తగ్గించామన్నారు. హెల్త్ కార్డులిచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. డీఏ, పీఆర్సీపై పభుత్వం సానుకూ లంగా ఉందన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వానికి ప్రేమ, గౌరవం ఉందని, వారుకూడా అదే విధంగా మెలగా లని కోరారు. ఎస్టీయూటీఎస్ 80 ఏళ్ల ప్రస్తా నం స్ఫూర్తిదాయకమని, యూని యన్ ప్రజాస్వామిక గళం వందేళ్లు వినిపిం చాలని పేర్కొన్నారు. యూనియన్ నేతలకు అభినందనలు తెలిపారు. సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దు తూనే తమ సమస్యలపై, హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు.

హక్కుల సాధనలో విశ్రమించం

ఎందరో ఉపాధ్యాయ నేతల త్యాగాలతో నేడు అనేక ప్రయోజనాలు, హక్కులు పొం దుతున్నామని, వారి బాటలో నడవడమే వారికి మనం ఇచ్చే నివాళి అని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకుఎస్టీయూ  మరింత చేరువై ఐక్య ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ ౨ డీఏలు పొందామని, పీఆర్సీ కూడా పొందే అవకాశం ఉందన్నారు.  

జేఏసీ పోరాటం ఆగదు

జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్‌లు పరిష్కరించేంత వరకు జేఏసీ పోరాటం ఆగదని, ఆగలేదని తెలిపారు. గతంలో సీఎంతో మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వింటోందని, నిరసనలు తెలిపే స్వేచ్ఛా ఉందన్నారు.  ప్రభుత్వానికి ఉద్యోగులంటే భయం ఉండాలి.. ఉద్యోగులకు ప్రభుత్వం అంటే భయం ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎస్టీయూ పూర్వ అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సాబేర్ ఆలీ, ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ఏపీ, తెలంగాణ ఎస్టీ యూ నాయకులు భారీగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు