రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం..

03-11-2026 | 06:34pm

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

గోవిందరావుపేట, నవంబర్ 3 (విజయక్రాంతి): నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే 36వ అఖిలభారత మహాసభల సందర్భంగా గోవిందరావుపేటలోని పీఎస్ఆర్ గార్డెన్లో తెలంగాణ రైతు సంఘం(Telangana Rythu Sangham) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు వ్యవసాయంపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది.

ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరైన పోతినేని సుదర్శన్ రావు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ఆహార సమస్యను పరిష్కరించాలని హరిత విప్లవం పేరుతో ప్రాజెక్టు నిర్మించి హైబ్రిడ్ విత్తనాలను విస్తరింపజేసి వ్యవసాయ అభివృద్ధికి నాడు కృషి చేసినారని అన్నారు. దేశంలో 1991తర్వాత నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించినప్పటి నుండి వ్యవసాయ రంగంలో రైతులు విత్తనాభివృద్ధిలో కీలక పాత్ర పోషి నేడు కార్పొరేట్ చేతుల్లోకి విత్తన రంగం వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నవంబర్ 15 నుండి 18 వరకు జరుగు అఖిలభారత 36వ మహాసభలు నల్లగొండలో జరుగుతున్నాయని ఈ మహాసభలలో రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని అది పార్లమెంట్లో చట్టం చేయాలని అంతే కాకుండా రైతుల అప్పులు మాఫీ చేయాలని 60 ఏళ్లు పైబడిన రైతులందరికీ 10,000 పింఛన్ ఇవ్వాలని అనేక రైతు సమస్యలు ఈ మహాసభలో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మహాసభకు ములుగు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సంఘం సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాలో గోదావరి ప్రతి సంవత్సరము 8 నుండి పదివేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వరంగల్ జిల్లాలో దేవాదుల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించిన అది నెరవేరడం లేదని ములుగు జిల్లా లోని లక్నవరం చెరువుకు నీరు వెంటనే అందించాలని, కాలువ లైనింగు చివరి ఆయకట్టు వరకు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో సిద్ధి రైతులకు న్యాయం చేయాలని, ఎకరాకు 80 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి గఫూర్ పాషా, తుమ్మల వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, సామ చంద్రారెడ్డి, ఎండి యాకూబ్, బండారి నరసింహులు, గౌరారపు చంద్రశేఖర్, కంటెం సత్యం, ఎల్పి ముత్యాలు, నర్రా  శివప్రసాద్, కన్నోజు సదానందం, రైతులు బండమీద అశోక్, బొబ్బ సత్తిరెడ్డి, రావి నాగర్జున, పన్నాల శ్రీరామ్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పొదిల్ల చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు