హోమియోపతి వైద్యశాలకు తాళం

03-11-2026 | 06:42pm

పట్టించుకోని అధికారులు...

తాడ్వాయి,నవంబర్, 03( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ లోని హోమియోపతి వైద్యశాలకు(Homeopathy Clinic) మంగళవారం తాళం వేసి ఉంది.తరచుగా హోమియోపతి వైద్యశాలకు(Homeopathy Clinic) తాళం వేసి ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోమియోపతి వైద్యం కోసం ప్రత్యేకంగా వచ్చే రోగులు అవస్థల పాలవుతున్నారు.

హోమియోపతి వైద్యశాల తెరిచి ఉంటుంది, మాకు వైద్యం అందుతుంది అనే ఉద్దేశంతో వచ్చిన రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాళం వేసి ఉండడంతో రోగులు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హోమియోపతి వైద్యశాల తెరిచి ఉండాలి.కానీ అందుకు భిన్నంగా వైద్యశాలకు తాళం వేసి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిరోజు హోమియోపతి వైద్యశాల తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు