సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

03-11-2026 | 06:47pm

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు

భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 ( విజయ క్రాంతి ) : అడవులు, వన్యప్రాణులు, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రీన్ వారియర్ చంద్రశేఖర్(Green Warrior Chandrashekhar) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Government Degree College) మంగళవారం అంతర్జాతీయ జీవావరణ మండలాల దినోత్సవాన్ని కళాశాల వృక్షశాస్త్ర, జంతుశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనంగా నిర్వహించగా గ్రీన్ వారియర్ చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు జీవావరణ రిజర్వుల ప్రాముఖ్యత, ప్రకృతి పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ సమతుల్యత ఆవశ్యకత గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు.

ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, సహజ వనరులను పొదుపుగా వినియోగించడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆర్ శ్రీధర్, టి శ్రీధర్, ఎ దేవేందర్, కె శ్రీనివాస్, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు