లైఫ్‌లైన్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

09-10-2026 | 04:16pm

జిల్లా కలెక్టర్ కె. హరిత

కాగజ్‌నగర్‌ (విజయక్రాంతి): సిర్పూర్‌–కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌(Sirpur-Kaghaznagar Railway Station) వద్ద ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌(Impact India Foundation) ఆధ్వర్యంలో లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో(Lifeline Express train) అందించే వైద్య సేవలను(Medical services) జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె. హరిత(Collector K. Haritha) పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె వైద్య సేవలను పరిశీలించారు. ఈ నెల 16 నుంచి నవంబర్‌ 4 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు పలు రకాల శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షలకు వచ్చే వారు ఆధార్‌ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ సభ్యులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు