కాంగ్రెస్ మైనార్టీ విభాగం నూతన బాధ్యులకు సన్మానం
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నూతనంగా నియమితులైన జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్(Shaik Kaleem), జిల్లా వైస్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్(Mohammed Imtiaz Ahmed) (సాజిద్)లను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా(Congress Party Municipal Floor Leader Abdullah) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమన్ భాయ్, తన్వీర్ అహ్మద్, మహ్మద్ షఫీ, అర్షద్, మహ్మద్ తాజ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.