అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు

19-09-2026 | 07:23pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత (District Collector K. Haritha)అన్నారు.అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.

అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, తరచూ గైర్హాజరు కావడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకన్న, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు