విద్యా ప్రమాణాలను మెరుగుపరుచాలి

01-10-2026 | 08:05pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాల(Ashram Schools)ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏసీఎంఓ ఉద్దవ్(ACMO Uddhav) సూచించారు. గురువారం సిర్పూర్-టి మండలం(Sirpur-T Mandal)లోని ఆశ్రమ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను స్పెషల్ ఆఫీసర్‌గా సందర్శించి ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణను పరిశీలించారు.

విద్యార్థుల హాజరు, పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన వారితో మాట్లాడి సిలబస్ పూర్తయిన తీరు, అభ్యసన సామర్థ్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వసతి గృహాల్లో భోజనం, వసతి, ఇతర సౌకర్యాలపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రవీందర్, కన్నయ్య, హెచ్‌డబ్ల్యూఓలు శ్రీనివాస్, రాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు