పీఎం రాహత్ స్కీం సద్వినియోగం చేసుకోవాలి

01-10-2026 | 09:59pm

మేడ్చల్ అర్బన్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులకు వైద్య ఖర్చులకు సంబంధించిన పీఎం రాహత్ స్కీమ్(PM Rahat Scheme) సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కృష్ణప్రియ మల్లారెడ్డి అన్నారు. వైద్య ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు అందజేస్తుందని తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే 112 నెంబర్ కు ఫోన్ చేయాలని, పోలీసు కేసు అవసరం లేదని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని హాస్పిటల్ తెలుసుకొని అందులో చికిత్స తీసుకోవాలని తెలిపారు. హాస్పిటల్లో మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ ఫండ్ అని పది రోజుల్లో డబ్బులు అందుతాయని తెలిపారు. ఈ పథకం ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అమలులో ఉందని వివరించారు.

మరిన్ని వార్తలు