ప్లాస్టిక్‌ వాడకం తగ్గిద్దాం- ప్రకృతిని కాపాడుదాం

01-10-2026 | 09:56pm

పాఠశాల ఎకో క్లబ్, యంగ్ ఎర్త్ లీడర్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో  ర్యాలీ.

నేరేడుచర్ల,అక్టోబర్01(విజయ క్రాంతి): ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(PM Sri Zilla Parishad High School) నేరేడుచర్ల ఎకో క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్స్  విద్యార్థులు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గిద్దాం ప్రకృతి అనుకూల జీవనం సాగిద్దాం’, నేటి మన అలవాట్లే,రేపటి మన భవిష్యత్తు అని,ప్లాస్టిక్‌ సంచి వద్దు,వస్త్ర ముద్దు అని ఉపాధ్యాయులు విద్యార్థులు నినదించారు.

ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మరియు స్థానిక కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణహితమే పరమ ధర్మమని పాఠశాల ఎకో క్లబ్,యంగ్‌ ఎర్త్‌ లీడర్స్‌ విద్యార్థులు విద్యార్థుల్లో, సమాజంలో పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జలసంరక్షణ,ప్లాస్టిక్‌ నివారణ,మొక్కలు నాటడం,వాటి సంరక్షణ,జీవవైవిధ్య పరిరక్షణ,ప్రకృతి వనరుల పొదుపు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎకో క్లబ్ ఇన్చార్జి సహోపాధ్యాయులు ఎం జానకి రాములు యంగ్ ఎర్త్ లీడర్స్ ఇంచార్జ్ పీడీ ఎం యాదగిరి ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ రెడ్డి కె శ్రీనివాసరావు ఎం వినోద్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు