వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

01-10-2026 | 10:09pm

వెంకటాపురం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం అటవీశాఖ(Forest Department) ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ(Wildlife Protection), అడవుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజనల్ అధికారి జి. ధ్వాలియా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ర్యాలీ మండలంలోని చిరుతపల్లి, పర్మికగూడెం, రామవరం తదితర గ్రామాల మీదుగా కొనసాగింది.

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అటవీ చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అడవికి నిప్పు.మానవాళికి ముప్పు అనే నినాదంతో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఫారెస్ట్ సబ్ డివిజనల్ అధికారి జి. ధ్వాలియా తెలిపారు. ప్రజల్లో అటవీ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అడవులు, వన్యప్రాణుల పరిరక్షణపై గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు