యాదగిరిగుట్ట మున్సిపల్ సర్వసభ్య సమావేశం
- బిజెపి కౌన్సిలర్ల ఆరోపణలు అవాస్తవం
- అన్ని వార్డులకు సమన్యాయం
- చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్
- బిజెపి కౌన్సిలర్ల వాకౌట్ కార్యాలయం ముందు ధర్నా
- మున్సిపల్ ఎజెండాపై శ్వేత పత్రం విడుదల చేయాలి
- చైర్మన్ చెప్పినట్లు నడుచుకుంటున్న కమిషనర్
- బిజెపి కౌన్సిలర్ కర్రే మాధవి, బోడ రాధ
యాదగిరిగుట్ట, అక్టోబర్ 1 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపల్(Yadagirigutta Municipal) అభివృద్ధి ధ్యేయంగా ఎజెండాను రూపొందించడం జరిగిందని సమావేశంలో మాట్లాడి చర్చించాల్సిన విషయాన్ని వాకౌట్ చేసి రాద్ధాంతం చేస్తూ ధర్నా చేయడం బిజెపి కౌన్సిలర్లకు న్యాయం కాదని ప్రజలు ఓట్లు వేసి కౌన్సిల్‌గా పంపించారని వారి తరఫున సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించుకోవలసిన బాధ్యత వారిపై ఉంటుందని సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి నిర్ణయాలే జరుగుతాయని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు.
గురువారం యాదగిరిగుట్ట మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కాంగ్రెస్ బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే బిజెపి కౌన్సిలర్లు కర్రె మాధవి, బోడ రాధ ఎజెండా అంశాలు అన్ని అవకతవకలుగా ఉన్నాయని వాకౌట్ చేసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
సమావేశం అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎజెండాలో 43 అంశాలు చర్చకు వచ్చాయని, నాలుగు అంశాలను తిరస్కరించడం జరిగిందని, నాలుగు అంశాలను వాయిదా వేయడం జరిగిందని, 35 అంశాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఓట్లు వేసిన కౌన్సిల్ కు ప్రజలు పంపించారని ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని 12 వార్డుల సభ్యులు సమానమేనని ఒక్కొక్క వార్డుకు 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఎమర్జెన్సీ అంశాలు ఉంటే వాటికి అత్యవసర కేటాయింపులు జరగడం జరుగుతుందని అన్నారు.
పాత గుట్ట రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సభ్యులు తీర్మానం చేసినట్టు తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ లో కాంగ్రెస్ తో పాటు టిఆర్ఎస్ సిపిఐ బిజెపి కౌన్సిలర్లు ఉన్నారని అందరికీ సమన్యాయం జరుగుతుందని ప్రతి వార్డుకు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. బిజెపి కౌన్సిలర్లు చేసిన ఆరోపణలు వాస్తవమని అన్నారు.
వైస్ చైర్మన్ బుడిగే రమ్య రామ చందర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ అందరికీ సమన్యాయంగా అభివృద్ధిని జరుపుతున్నారని బిజెపి చేసిన ఆరోపణలు అవాస్తమని అన్నారు. టిఆర్ఎస్ కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదగిరిగుట్ట అభివృద్ధికి కౌన్సిలర్ చైర్మన్ కృషి చేస్తున్నారని బిజెపి చేసే ఆరోపణలో నిజం లేదని అన్నారు.
సిపిఐ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు సలహాలు సూచనలు చేస్తూ ఎక్కడ నిధులను పెట్టాలో అక్కడ సమకూరుస్తున్నారని అభివృద్ధికై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దగ్గరికి వెళ్లి అభివృద్ధికి సహకరించాలని హైదరాబాదుకు తీసుకెళ్లి ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని యాదగిరిగుట్ట అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ సహకరించాలని బిజెపి కౌన్సిలర్ల ఆరోపణలు అవాస్తమని అన్నారు....
బిజెపి కౌన్సిలర్ల వాకౌట్ కార్యాలయం ముందు ధర్నా.....ఎజెండా అంశాలు అస్తవ్యస్తం అవినీతిమయం పలు ఆరోపణలు... యాదగిరిగుట్ట మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలు అస్తవ్యస్తంగా అవినీతిమయంగా ఉన్నాయని పలు ఆరోపణలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ లు కర్రే మాధవి, బోడ రాధ మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపల్ నిధులపై ఎంత ఆదాయం వస్తుంది ఏ ఏ పనికి ఎంత ఎంత ఖర్చు చేస్తున్నారు
శ్వేత పత్రం విడుదల చేయాలని, యాదగిరిగుట్ట లోని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని ఎజెండా లోని పలు అంశాలు నిధుల దుర్వినియోగం పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అయినా మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడంలేదని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎట్లా చెబితే అట్లా కమిషనర్ నడుచుకుంటున్నాడని ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. చైర్మన్ కమిషనర్లు కుమ్ముకై అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగే రమ్య రామచందర్, మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, పేర బోయిన సత్యనారాయణ, బబ్బూరి శ్రీధర్, బూడిద మధు, పెళ్లి మెల్లి లావణ్య, కాటబత్తిని స్వప్న,సాదునేని ధనలక్ష్మి, బిట్టు సరోజ, అధికారులు పాల్గొన్నారు.