హనుమాస్కుంట చెరువు అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

01-10-2026 | 09:53pm

హైడ్రా కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన.. వజ్రేష్ యాదవ్

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌లో ఉన్న హనుమాస్కుంట చెరువు అభివృద్ధి(Hanumaskunta Lake Development), పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్(DCC President Vajresh Yadav) హైడ్రా కమిషనర్‌ రంగనాథ్(HYDRA Commissioner Ranganath)ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. హనుమాస్కుంట చెరువు స్థానిక ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన జలవనరు అని తెలిపారు.

చెరువు అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల సుందరీకరణ, కాలుష్య నివారణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. చెరువు పరిధిలో ఆక్రమణలు, మురుగునీటి సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి పరిష్కరించాలని, చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హనుమాస్కుంట చెరువు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన హైడ్రా అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి, పుల్లకండ్ల జంగారెడ్డి, పుల్లకండ్ల వెంకట్ రెడ్డి, పుల్లకండ్ల రాజి రెడ్డి, సింగిరెడ్డి రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు