రైతులు వరి, మొక్కజొన్న వంటి పంటలు వేయవద్దు
కూసుమంచి: యాసంగిలో రైతులు(Farmers) వరి, మొక్కజొన్న వంటి పంటలు వేయవద్దని క్లస్టర్ ఎండి జానీ(Cluster MD Jani) రైతులకు సూచించారు. శుక్రవారం కూసుమంచి గ్రామపంచాయతీ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం రైతులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ జానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం(El Nino impact) దృష్ట్యా భూగర్భ జలమట్టం తగ్గిపోతుందని, అందువలన యాసంగిలో రైతులు వరి, మొక్కజొన్న వంటి పంటలు వేయవద్దని, తక్కువ నీటిని వినియోగించుకునే పెసర, మినుము, వేరుశనగ, జొన్న వంటి పంటలను స్వల్పకాలిక పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు.
అనంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు నీటి లభ్యత యాసంగిలో నీటి కొరత రైతులకు నీళ్లు ఎంతవరకు అందించగలరు మరియు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కృష్ణవేణి, ఉప సర్పంచ్ చెన్ను వెంకటర మణ, పంచాయతీ కార్యదర్శి , ఎలక్ట్రిసిటీ సిబ్బంది మరియు జిపిఓ వసంతరావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.