గోరిలపాడుతండాలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం
కూసుమంచి, అక్టోబర్ 18(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) కూసుమంచి మండలం గోరిలపాడుతండా గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ(Sri Sri Sri Kanakadurgamma) అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని(Food distribution program) భక్తిశ్రద్ధలతో(Devotional) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బానోతు సరస్వతి సర్పంచ్, కూసుమంచి మాజీ ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, గ్రామ పెద్దలు, యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు, భక్తులు(devotees) ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతమైంది.