వరంగల్ హైవే రెడీ!

12-09-2026 | 05:30am
  1. ప్రారంభానికి సిద్ధంగా ఎన్ హెచ్ 563
  2. ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు
  3. తీరనున్న వాహనదారుల కష్టాలు    

కరీంనగర్, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): భారత్ మాల పరియోజన పథకం(Bharatmala Pariyojana Scheme)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) 1,641 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హనుమకొండ - కరీంనగర్(Hanumakonda - Karimnagar) మధ్య నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి(National Highway) ఎన్ హెచ్ 563 ప్రయాణానికి పూర్తిగా సిద్దమైంది. 68 కిలోమీటర్ల మేర అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్(Advanced Traffic Management System) తో నిర్మించిన నాలుగు లైన్ల రహాదారి(Four-lane road) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(National Highways Authority of India) అధికారులు వాహనాల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic problems) లేకుండా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళే సామర్థ్యం తో నిర్మాణం చేశారు. అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్(Advanced Traffic Management System) తో 9 భారీ ప్లైఓవర్లు, వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్ పాస్ ల తో శంకరపట్నం, మానకొండూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను ఏర్పాటు చేసి రహదారిని డిజైన్ చేశారు. కట్టుదిట్టమైన భధ్రత, సాంకేతికత చర్యలు చేపట్టి రహాదారి పై సిసి కెమెరాలు, కెమెరాలు, సోలార్ లైట్లు, ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు.

రోడ్డుపై ప్రయాణం చేసే వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భధ్రత చర్యలు తీస్కోని రహాదారి నిర్మాణం చేశారు. అంతే కాకుండా అతి త్వరలోనే కరీంనగర్ నుండి జగిత్యాల జాతీయ రహదారిని అభివృద్ధి చేసేందుకు దాదాపు 2 వేల కోట్ల రూపాయల నిధులతో టెండర్లు పూర్తి ఆ రహాదారిని కూడ ఇదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాబోయే 2 సంవత్సరాల్లో కరీంనగర్ టూ జగిత్యాల రహదారిని కూడ ప్రజలకు అందుబాటులోకి రానుంది.   

- గొప్ప నాయకుడు బండి :- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్

హనుమకొండ - కరీంనగర్ రహాదారి కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కృషి చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగంటున్న రోడ్డును నేడు దాన్ని నిజం చేస్తూ.... ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగు పరచాలి.... ప్రజలు సంతోషంగా ఎలా జీవించాలి అనే ముందు చూపుతో వాటన్నిటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ... గత ఏడు సంవత్సరాల కాలంలో బండి సంజయ్ కుమార్ అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు.

ఒక వైపు గ్రామాల అభివృద్ధి... మరో వైపు నగరాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ.... ప్రజల జీవన విధానాలను మెరుగు పరుస్తున్నారు. కరీంనగర్ నగరంలో చేపట్టిన... చేపట్టబోతున్న కార్యక్రమాలే అభివృద్ధి కి నిదర్శనం. నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులను విడుదల చేయించి... కరీంనగర్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రస్తుతం జాతీయ రహదారులను తీసుకువచ్చి... ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే నిదర్శనం.

మరిన్ని వార్తలు