మండల ప్రజా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ పదవి విరమణ
31-10-2026 | 11:20pm
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల ప్రజా పరిషత్తు కార్యాలయము(Mandal Praja Parishad Office) మఠంపల్లి నందు జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) పని చేస్తున్న వెంకటయ్య శనివారం పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీడీవో సుమంత్ రెడ్డి, సూపర్డెంట్ కృష్ణవేణి, టిపిఆర్ఎంఏ జిల్లా కోశాధికారి మణి, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు యం. వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, నేరేడుచర్ల సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ నడిగూడెం సీనియర్ అసిస్టెంట్ నాగలక్ష్మి, గరిడేపల్లి టైపిస్టు మట్టమ్మ, ఏపీవో ఉమా పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది ఈ పంచాయతీ స్టాఫ్ పాల్గొన్నారు.