బీఆర్ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు

27-09-2026 | 04:25pm

నారాయణపేట్ జిల్లా కొత్తపల్లి మండలంలో ఘనంగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

కొత్తపల్లి: కొత్తపల్లి మండలంలో(Kothapalli Mandal) బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం(BRS Party Flag Hoisting Event) ఘనంగా నిర్వహించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Former Kodangal MLA Patnam Narendar Reddy) భూనీడు గ్రామం నుంచి వాల్యనాయక్ తండా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వాల్యనాయక్ తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బంజారా సంప్రదాయ నృత్యాలతో పట్నం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భూనీడు, గోకుల్ నగర్, దుప్పటిగట్టు, దుప్పటి తండా, వాల్యనాయక్ తండాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) ప్రభుత్వ హయాంలో ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండాకు తాగునీరు అందించినట్లు తెలిపారు.

గిరిజనుల సంక్షేమం కోసం ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందని విమర్శించారు. గిరిజనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే, మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలుగొన్నారు.

మరిన్ని వార్తలు