రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

31-10-2026 | 11:22pm

చొప్పదండి,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని మానేరు డ్యామ్ సమీపంలో గల ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఈరోజు నిర్వహించిన అండర్-19 ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్(U-19 SGF District Athletics) పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్(Telangana Social Welfare Residential Sainik School), రుక్మాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం ఐదు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

బంగారు పతకాలు:

  • ఆర్. అభిషేక్ – 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్
  • పి. జెశ్వంత్ – 200 మీటర్ల పరుగు
  • డి. సిద్ధార్థ – 400 మీటర్ల పరుగు
  • వెండి పతకాలు:
  • డి. వర్షిత్ – 400 మీటర్ల పరుగు
  • జి. మనోహర్ – 5 కిలోమీటర్ల పరుగు

ఈ సందర్భంగా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన పీఈటీలు  సుమన్, విక్రమ్‌లను పాఠశాల డైరెక్టర్ రాజదత్త, ప్రిన్సిపాల్ పి. దేవేందర్, ఎస్‌వీపీ  కె. శ్రీనివాస్, జేవీపీ ప్రమోద్ రాజ్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు