ధాన్యం కొనుగోలుకు జాప్యం ఎందుకు?

03-11-2026 | 06:08pm

* అకాల వర్షానికి  తడిసిన వరి ధాన్యం 

* వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలి

* ఐకేపీ వద్ద బిజెపి నాయకులు డిమాండ్

ముస్తాబాద్, నవంబర్ 03 (విజయక్రాంతి): సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పూర్తిగా వరి ధాన్యం తడిసిపోయింది.మంగళవారం బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి  ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.చేతికి వచ్చిన ధాన్యం తడసి పోవడం తో రైతులు ఆందోళన చెందుతూ తమ ధాన్యాన్ని బిజెపి నాయకులకు చూపుతూ త్వరగా కొనుగోలు చేపట్టాలని మొర పెట్టుకున్నారు.

ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం,ఎల్నినో ప్రభావం కారణంగా సగానికి పైగా రైతులు తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు ఇప్పటికే అమ్ముకున్నారని పేర్కొన్నారు.మిగిలిన రైతుల ధాన్యానికైనా వెంటనే కాంట మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధర ఇవ్వాలన్నారు.పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ల ప్రారంభం చేస్తూ ఇప్పటివరకు ధాన్యం సేకరణ చేయడం లేదని ఏద్దేవా చేశారు.

వెంటనే కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టి రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని  షరతులు విధించకుండా కొనుగోలు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ అంజాగౌడ్,మండల ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ, మండల ఉపాధ్యక్షుడు మహేష్, మల్లేశం,శ్రీనివాస్ రావు పోతుగల్ ఉప సర్పంచ్ కృష్ణగౌడ్ మండల ఉపాధ్యక్షులు మహేష్, సత్తయ్య, వేణుగోపాల్, అనిల్,యాదగిరి,శ్యామ్, కనకయ్య,రమేష్, రాజు ఆకాష్,రాజు,రైతులు బాలయ్య, పర్శరాములు, దుర్గయ్య,రాజలింగం, దుర్గయ్య,ఆశయ్య,కూశయ్య,కనకవ్వసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు