బాధితులకు అండగా న్యాయసేవాధికార సంస్థ

03-11-2026 | 06:20pm

భూపాలపల్లి, నవంబర్ 03 (విజయ క్రాంతి): అర్హులైన బాధితులకు న్యాయసేవాధికార సంస్థ అండగా నిలుస్తుందని గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్(Government Pleader Botla Sudhakar) తెలిపారు. నవంబర్ 9 జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో న్యాయసేవల వారోత్సవాలను ప్రారంభించారు.

మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, పరిరక్షణ అధికారులు రాజకొమురయ్య, వెంకటస్వామి, హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, సఖి కేంద్రం కోఆర్డినేటర్ గాయత్రీ, సూపరింటెండెంట్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు