తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం
కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): దళిత సేన జిల్లా నాయకులు చంటి శ్రీనివాస్ ఇటీవల నూతనంగా నియమితులైన ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా(Karimnagar District) అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి గారికి, తెలంగాణ రక్షణ సేన నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ లను తెలంగాణ రక్షణ సేన జిల్లా దళిత సేన నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుంజపడుగు హరిప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) బలోపేతానికి గుంజపడుగు హరిప్రసాద్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పార్టీ మరింత బలమైన పోరాటాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు మ్యాకల తిరుపతి, శ్రీరాముల రమేష్, ధర్మరెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, ఉల్లేంగుల నరేష్, లంక మనోజ్ తదితరులు పాల్గొన్నారు.