యూనివర్సిటీలో జిమ్నాసియం ప్రారంభం
09-09-2026 | 05:59pm
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University)లో నూతనంగా నిర్మించిన అధునాతన యూనివర్సిటీ జిమ్నాసియం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ సారథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Karimnagar Police Commissioner Gaush Alam) ముఖ్య అతిథులుగా హాజరై వ్యాయామశాలను అధికారికంగా విద్యార్థులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్, విసి ఓఎస్డి డాక్టర్ హరికాంత్ అధ్యాపకులు వివిధ విభాగ అధిపతులు, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జిమ్ లోని నూతన వ్యాయామ పరికరాలను పరిశీలించారు.