లారీ పై నుండి రోడ్డుపై పడిన గ్రానైట్ బండ

27-10-2026 | 06:37pm
  1. తృటిలో తప్పిన పెను ప్రమాదం
  2. ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు

మానకొండూరు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన మానకొండూరు చెరువు కట్ట(Manakondur Tank Bund) సమీపంలో మంగళవారం - వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ బండ లారీలో నుండి అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా బావుపేట నుండి గ్రానైట్ బండతో కర్ణాటక వైపు వెళ్తున్న లారీ లో నుండి అదుపుతప్పి, ప్రమాదవశాత్తు నేషనల్ హైవే పై గ్రానైట్ బండ నడి రోడ్డు పై పడిపోయింది.

ప్రమాద సమయంలో లారీ వెనుక ముందు, రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు లేకుండా గ్రానైట్ బండలను ఓవర్ లోడ్ లారీలతో తరలించడం, మితిమీరిన వేగంతో గ్రానైట్ లారీలు ప్రధాన రహదారిపై వెళ్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానకొండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధకరించారు.

మరిన్ని వార్తలు