తాటి వనం ధ్వంసంపై ఫిర్యాదు
కొత్తపల్లి, నవంబర్ 06 (విజయక్రాంతి): తెలంగాణ గౌడ సంఘం(Gouda Community) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం సుగుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఖాజీపూర్ గౌడ సంఘం నాయకులు శుక్రవారం రోజున ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 216, 132, 133 గల భూములు ఎస్.ఆర్.ఎస్.పి ముంపునకు గురైన ప్రభుత్వం తీసుకున్న భూమి, ఆ భూమిలో దాదాపు80 సంవత్సరాలుగా తాటి, ఈత వనం ఉన్నది, తాత, తండ్రుల నుండి వస్తున్న గీత వృత్తితోనే 50 గౌడ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని , గతంలో ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఈ చెట్లకు నంబరింగ్ కూడా చేసారు.
కానీ ప్రస్తుతం కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ, అందులో ఉన్న తాటి, ఈత చెట్లను తొలగిస్తూ, తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని సంఘం నాయకులు అధికారి గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఖాజీపూర్ గౌడ సంఘం అధ్యక్షులు పురుషోత్తం, శ్రీనివాస్ ,పంజాల రమేష్, ఔడగోని శ్రీనివాస్, పురుషోత్తం ఆంజనేయులు పురుషోత్తం ఏసు, పులి శ్రీను, పురుషోత్తం సత్తయ్య, వెంగళ వంశీ, ఔడగోని పరశురాం మరియు వెంగళ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.