ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన
సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): ఈ నెల 30 న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కరీంనగర్,సిరిసిల్ల పర్యటన కార్యకర్తల్లో ప్రజల్లో జోష్ నింపడం ఖాయం అని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) అన్నారు.60 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని(New Collectorate building) ప్రారంభించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని(Statue of Telangana Talli) ఆవిష్కరిస్తారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సుడా నిధులు కోటి రూపాయలతో కలెక్టరేట్ ఉత్తరం వైపునుండి ప్రధాన రహదారి నిర్మాణం, హెలిప్యాడ్ నిర్మాణానికి 65 లక్షలు, గార్డెన్ల కు, సింథెటిక్ ట్రాక్ నిర్మాణానికి కోటి రూపాయలు పాత బిల్డింగ్ ఫేస్ లిఫ్ట్ కు 30 లక్షలు అన్నీ కలిపి 3 కోట్ల సుడా నిధులు వెచ్చించామని నరేందర్ రెడ్డి తెలిపారు.
బీజేపీ నాయకులకు డ్రామాలు,దాడులు నిత్య కృత్యం అయ్యాయని, దాడుల సంస్కృతి మంచిది కాదనే ఉద్దేశంతో ఓపిక పడుతున్నామని ఇక చూస్తూ ఊరుకోబోమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జ్ పై లైట్లు వెలుగక పోవడానికి కారణం ఆనాడు లోపభూయిష్టంగా చేసిన టెండర్ ప్రక్రియ వల్లనే అని ఆరోపించారు. ఆర్వోబి నిర్మాణం ఆలస్యానికి కారణం 3 సంవత్సరాల తర్వాత మెయిన్ పియర్స్ డిజైన్స్ ఇవ్వడం వల్ల అని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భూ బాగోతాన్ని బట్టబయలు చేసిన నేపథ్యంలో సీఎం పర్యటన అనగానే బీఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారని ఇన్నిరోజులు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అని కేటిఆర్ ఇక కాస్కో అని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఈ విలేకరుల సమావేశంలో కార్పోరేటర్లు వరాల నర్సింగం,పర్వతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.