పలు గ్రామాలను సందర్శించిన ఎల్లారెడ్డి డిఎల్పిఓ

22-10-2026 | 04:10pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 22 (విజయ క్రాంతి): మండలంలోని చీనూర్, మాల్తుమ్మెద,పోచారం గ్రామాలను ఎల్లారెడ్డి డిఎల్పిఓ శ్రీనివాస్(Yellareddy DLPO Srinivas) గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎల్పిఓ శ్రీనివాస్ గ్రామ పంచాయతీల యొక్క రికార్డ్స్,మెయింటెనెన్స్ మరియు కంపోస్ట్ షెడ్లను మరియు విబిజి-ఆర్ఏఎంజి పథకం యొక్క హార్వెస్టింగ్ పాండ్ పనులను కూడా సందర్శించారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నూతన డిఎల్పిఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు.తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని,ప్రతిరోజు గ్రామాలలో పారిశుద్ధ పనులు చేపట్టాలని, సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి,గ్రామ సర్పంచులు మురళీమోహన్ గౌడ్, సంజీవరావు,పుప్పాల సాయిలు,పంచాయతీ కార్యదర్శులు వనిత,అశోక్ కుమార్,అశోక్,ఫీల్డ్ అసిస్టెంట్లు అంజయ్య, స్వప్న,పంచాయతీ సిబ్బంది,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు