6 September, 2026 | 12:01 AM

భక్తిశ్రద్ధలతో ఘనంగా దర్గా ఉత్సవాలు

05-09-2026 | 10:42pm

ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మత గురువులు

భారీగా తరలివచ్చిన భక్తులు

కులమతాలకు అతీతంగా ఉర్సు ఉత్సవాలు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్‌పేట్ గ్రామం(Gopalpet Village)లో పీరానే పీర్ గౌసే ఆజం దస్తగీర్ హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ దర్గా ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో కన్నులపండువగా నిర్వహించారు. ఖాన్‌ఖాయే ఆబిదుల్ హాష్మీ పీఠాధిపతి హజ్రత్ ముహమ్మద్ షరీఫోద్దీన్ షత్తారీ ఉల్ ఖాద్రీ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు(Ursu celebrations) వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఖురాన్ పఠనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం దర్గా వద్ద గంధం, చాదర్‌లను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం ఖవ్వాలీ కార్యక్రమం భక్తులను అలరించింది. కులమతాలకు(caste religions) అతీతంగా నిర్వహించిన ఈ ఉర్సు ఉత్సవాలకు నాగిరెడ్డిపేట్ మండలంతో పాటు ఎల్లారెడ్డి, లింగంపేట్, నిజాంసాగర్, పిట్లం, మెదక్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) అన్నాసాగర్ ఖాన్‌ఖాయే హాష్మీ దర్గా జనషిన్ హజ్రత్ సూఫీ షా మొహమ్మద్ హుస్సేన్ షత్తారీ ఉల్ ఖాద్రీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు