6 September, 2026 | 12:19 AM

ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

05-09-2026 | 11:07pm

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ట్రస్మా ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(Dr. Sarvepalli radhakrishnan birthday) సందర్భంగా శనివారం నస్పూర్ లోని ఎంఎం గార్డెన్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు(Teachers day celebrations) ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో విలువ ఉన్నదని, ఉపాధ్యాయులు(Teachers ) విద్యార్థులకు విద్యను అందించడమే, కాకుండా కుటుంబ పరిస్థితులను, సమాజాన్ని మార్చే శక్తి,, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి ఒక ఉపాధ్యాయునికే ఉందన్నారు.

ఉపాధ్యాయులకు మెడి లైఫ్ హాస్పిటల్(Medilife Hospital)లో వైద్య చికిత్సలో రాయితీ కల్పించినందుకు మెడి లైఫ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా నస్పూర్ మండల విద్యాశాఖ అధికారి చౌదరి, ట్రస్మా(Tresma) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణిలు మాట్లాడుతూ ఒక డాక్టర్, ఇంజనీర్, రాజకీయవేత్త, అధికారి ఇలా ఎవరినైనా తయారు చేసేది ఉపాధ్యాయుడని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు తను కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగును ఇస్తూ నవ సమాజాన్ని నిర్మిస్తున్నారన్నారు. అనంతరం విద్యారంగంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు