6 September, 2026 | 12:35 AM

రామప్పను సందర్శించిన జియోలాజికల్ అధికారులు

05-09-2026 | 11:33pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని రామప్ప దేవాలయం(Ramappa Temple)ను శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివి ముఘల్(Geological Survey of India Additional Director General VV Mughal), డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ  అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల  విజయ్ కుమార్(Tourism Guide Gorantla Vijay Kumar) వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు. వారి వెంట  జీఎస్ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు అరుణ్, శ్రీకాంత్, బద్రు, దేవాదాయ,  పురావస్తు, టూరిజం  శాఖల సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు