ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకులు
05-09-2026 | 11:28pm
ప్రభుత్వ జూనియర్ కళాశాల యాదగిరిగుట్టలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల యాదగిరిగుట్టలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రిన్సిపల్ పి. మంజుల మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా, వారి జీవితానికి సరైన దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు అని అన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల జీవితంలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను, ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వివరించారు.






