5 September, 2026 | 8:45 PM

వంద పడకల దవాఖానను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

05-09-2026 | 06:30pm

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda District)లోని నకిరేకల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శనివారం పర్యటించారు. నకిరేకల్ లో రూ.345 కోట్లతో 12 రకాల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా రూ.32 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి(100 bed government hospital)ని ప్రారంభించినంతరం దవాఖాన మొత్తం తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో అందించబోయే సేవల గురించి ముఖ్యమంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(Young India Integrated School) కు, సమీకృత మండల కార్యాలయాల సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి నకిరేకల్ లోని రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు