తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనం వివరాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు(Tirumala devotees) శ్రీవారి సర్వదర్శనానికి 20-24 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 68,374 మంది భక్తులు దర్శించుకోగా, 35,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం(Tirumala Hundi Income) రూ.4.03 కోట్లు వచ్చినట్లు TTD ప్రకటించింది. వరస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
CRO తిరుమల – ఆఫ్‌లైన్ వసతి వివరాలు
05/09/2026 | ఉదయం 7:08 గంటలకు
₹50 & ₹100: 811 అందుబాటులో ఉన్నాయి
₹1,000 & ₹1,523: 38 అందుబాటులో ఉన్నాయి
CRO కాల్ సెంటర్ (24×7): 155 257






