6 September, 2026 | 12:37 AM

చైతన్య విద్యానికేతన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

05-09-2026 | 11:18pm

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్‌ చైతన్య విద్యానికేతన్‌ పాఠశాల(Chaitanya Vidyaniketan School)లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను(Teachers' Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఉపాధ్యాయులు(Teachers), తెలుగు పండితులు, కవి సుదర్శనం రాజయ్యను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించి గురువుల సేవలను కొనియాడారు. గురువులు అందించే జ్ఞానం, మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు