6 September, 2026 | 12:33 AM

సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమం

05-09-2026 | 11:24pm

టీజీ ఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని టీజీ ఈజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. టీజీఈ జెఎసి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యములో శనివారం కలెక్టరేట్ కార్యాలయములో గోడ పత్రిక ఆవిష్కరించారు. ఆ తరువాత టీజీ ఈ జెఎసి అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి(TG E JAC President Nara Venkata Reddy) అధ్యక్షతన  జరిగిన సమావేశములో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయసమ్మతమైన హక్కుల సాధన కోసం టీజీ ఈ జెఎసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని(Chalo Hyderabad event) విజయవంతం చేయాలి.

టీజీ ఈ జెఎసి కామారెడ్డి జిల్లా శాఖ తరపున పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని తమ సమస్యలపై స్పందించేలా చేయాలంటే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీ ఈ జె ఎ సి నాయకులు  కోరారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) నుండి సుమారు 5000 మంది ఆ రోజు హైదరాబాద్ తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయసమ్మతమైన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య ఉద్యమం అని స్పష్టం చేశారు. 

జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అందరు కదులుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని శాఖల అధిపతులు తమ సెలవు మంజూరి చేయడములో ఇబ్బంది పెట్టవద్దని ఆ రోజు యెంత మంది సెలవు పెడితే మొత్తం మందికి సెలవు మంజూరు చేయాలని టీజీఇ జేఏసీ పక్షాన కోరారు. ప్రతి ఒక్కరు కదలాలి… మన గొంతు ప్రభుత్వానికి వినిపించాలి” అనే నినాదంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి టీజీ జెఎసి ఉద్యమానికి బలాన్ని చేకూర్చాలని కోరారు.

మరిన్ని వార్తలు