పోడు భూములలో ట్రెంచ్ తవ్వకాలను నిలిపివేయాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): రైతులు(Farmers) సాగు చేసుకుంటున్న పోడు భూములలో టీఎస్ఎఫ్డీసీ అధికారులు(TSFDC officials) చేస్తున్న ట్రంచ్ తవ్వకాలను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ భూములల్లో కార్పొరేషన్ అధికారులు ట్రెంచ్ తవ్వడాన్ని శనివారం అడ్డుకున్నట్లు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్(CPI ML Mass Line) నాయకులు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పోడు సాగు(Paddy cultivation) చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న క్రమంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023న సాగుదారులగా గుర్తించి హక్కు పత్రాలు మంజూరు చేయడం జరిగిందని గత 20 సంవత్సరాల నుండి కార్పొరేషన్ అధికారులకు గ్రామస్తులకు ఎలాంటి విభేదాలు లేవని ఇప్పుడు వచ్చిన కార్పొరేషన్ అధికారులు కావాలనే ప్రజలు సాగు చేసుకుంటున్నా భూములల్లో ట్రంచ్ తవ్వాలని ప్రయత్నించడం సరికాదు.
సాగుదారులకు పట్టాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు వారి సరిహద్దు దాటి కావాలనే రైతుల పోడు భూముల మధ్యలోకి ట్రంచ్ తవ్వాలనే ఆలోచన సరికాదని అధికారులకు నాయకులు, గ్రామస్తులు సూచించారు.ఇప్పుడు వచ్చిన కార్పొరేషన్ శాఖ అధికారులు కావాలనే పట్టాలున్న పోడు భూమిలో ట్రెంచ్ తవ్వుతుండటంతో గ్రామస్తులు పార్టీ నాయకులు ఆందోళనకు దిగి ట్రెంచ్ తవ్వొద్దని కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్నారు.పేద ప్రజలు అరఎకరం ,ఎకరం సాగు చేసుకుంటున్న పోడు భూములపై కార్పొరేషన్ అధికారులు దౌర్జన్యంగా కావాలనే ట్రంచ్ తవ్వడానికి ప్రయత్నించడం మానుకోవాలని,లేకపోతే పెద్ద ఎత్తున గ్రామస్తులందరం కలిసి పేద రైతుల పోడు సాగుదారుల పక్షాన నిలబడి,పోరాడే ప్రజాసంఘ నాయకులను పార్టీలను కలుపుకొని ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు.






