సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి...
తాడ్వాయి,అక్టోబర్,27( విజయ క్రాంతి): విద్యార్థులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని డిప్యూటీ లీగల్ సర్వీసెస్ అధికారి ఎం. శ్రీనివాసరావు(Deputy Legal Services Officer M. Srinivasa Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడు పల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం 8,9,10వ తరగతి విద్యార్థులకు చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.పోక్సో తో చట్టంపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. టచ్ ఫోన్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ సర్వీసెస్ అధికారి విఠల్ రావు, ప్రధానోపాధ్యాయులు హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.